tecpmfwf ngo's Album: Wall Photos

Photo 8 of 104 in Wall Photos

కేంద్ర పారామిలటరీ జవాన్ అంతరంగాలు
***************************?
*జవాన్*:
*చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది.
*జవాన్ తండ్రి*:
*వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది.
*జవాన్ తల్లి*:
*అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు,24గంటలు గొడ్డుచాకిరి ,కనీసం విశ్రాంతి లేదు ,శెలవులు లేవు , కదా.
*జవాన్ భార్య*:
*పెళ్ళికి ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది. అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.
*జవాన్ అత్త మామలు*:
* మన కుటుంబంలో ఇంకెపుడూ కేంద్ర పారామిలటరీ జవాన్లకు పిల్లనివ్వకూడదు.
*జవాన్ పిల్లలు*:
* నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే పండగలు, శెలవులు రోజుల్లో ,ప్రతిరోజు సాయంత్రాలు హాయిగా నానతో ఆడుకుని వుండేవాళ్ళం.
*కేంద్ర పారామిలటరీ జవాన్ల పై అధికారులు*:-
* అంతంతమాత్రం చదవులు చదివి జవాన్ల ఉద్యోగంలోకి వచ్చేస్తారు. ఏంపనికి పనికిరారు ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.
*జవాన్ ఇంటి ఓనరు*:
జన్మలో జవాన్లకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.వేళాపాళాలేకుండా వస్తుంటారు వెళుతుంటారు.
*ఇది జవాన్ల వెట్టిచాకిరి* బ్రతుకులు ,విశ్రాంతి లేని జీవితం, చాలీచాలని జీతాలు,కుటుంబ సభ్యులతో సంతోషం లేని బ్రతుకులు, ప్రభుత్వం ప్రకటించిన శెలవులు వాడుకోని జీవితాలు , వెట్టిచాకిరితో అనారోగ్యం, తోటి ప్రభుత్వ ఉద్యోగులు 126రోజులు శెలవులు వాడుకుని జీతాలు తీసుకొంటుంటే ,ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10గంటలకు ఆపీసు వచ్చి 1గంటకు బోజనం చేసి మధ్యాహ్నం 3గంటలకు ఆఫీసుకు వచ్చి 5గంటలకు ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాడు ఒక్క జవాన్ తప్ప ,శెలవులు లేవు , 24గంటలు వెట్టిచాకిరి చేసే ఆర్ద్ సైనిక్ గురించి ప్రభుత్వం ఆలోచించాలి వీరికి న్యాయం చేయాలి పని ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి, పని గంటలు తగ్గించాలి, వారాంతపు శెలవు ఖచ్చితంగా అమలు చేయాలి, శ్రమ కు తగ్గ ఫలితం అంటే జీతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా పదోన్నతులు సరైన సమయం లో ఇస్తే ప్రభుత్వం జవాన్లకు కొంత మేలుచేసినట్లు వారికి ఊరట కలుగుతుంది..
*ఎవరి ఆలోచనసంతోషం వారిది..
*భారత్ మాత కె లియే జాన్ కుర్బన్
*పిర్ బి మేరా దిల్ హై హిందుస్తానీ