BkSai Syam Manohar Kanagala's Album: Wall Photos

Photo 1 of 51 in Wall Photos

దశాబ్ద కాలానికి పైగా తెలుగు రాష్ఞ్రాల ప్రజలను విశేషంగా అలరిస్తున్న  బుల్లితెర రియాలటీ షో స్టార్ మహిళ   యాంకర్ సుమను అశేష ప్రేక్షకుల ఇళ్ళలో ఒక కుటుంబ సభ్యురాలిగా మార్చింది.. ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమ ముగింపు వేడుకలు వారం రోజులుగా జరుగుతున్నాయి.. కార్యక్రమ నిర్వాహకులు ఈసందర్భంగా సుమను రోజుకోరకంగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు...ముగింపు వేడుకలో చివరిదైన ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సుమ కుటుంబ సభ్యులు సందడి చేశారు.. మధ్య మధ్యలో కార్యక్రమ నిర్వాహకులు ప్లే చేసిన వీడియోలు సుమను తీవ్ర భావోద్వేగానికి గురి చేశాయి.. ఈ సందర్భంగా సుమ తల్లిగారు.. మామగారు...సుమ పిల్లలు... తమ భావాలు పంచుకున్నారు.. చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే ఈ కార్యక్రమ చివరి రోజు విజేతగా ప్రముఖ గాయని సునీత నిలిచారు
సహజ నటి జయసుధ ముఖ్య అతిధిగా హాజరై సుమను కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.. అలాగే మల్లెమాల శ్యాం ప్రసాద్ గారు బాపినీడుగారు హాజరై కార్యక్రమం విజయవంతం అవడానికి సుమ అందించిన సహకారాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం రికార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైందంటే ఆ ఘనత సుమ గారిదే అని కొనియాడారు.. సుమ మాట్లాడుతూ స్టార్ మహిళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు
తనను ఇంతకాలం ఆదరించిన ప్రేక్షకులకు పోటీదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ ముగింపు ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని "త్వరలోనే మరో వినూత్న కార్యక్రమంతో మిమ్మల్ని అలరిస్తాను"అని పేర్కొన్నారు