పాక్ చెరలో ఉన్న భారత వాయు సేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్ధమాన్ నేడు విడుదలవుతున్న నేపధ్యంలో 1999 కార్గిల్ యుద్ధంలో ఇలాగే పాక్ సైన్యినికి పట్టుబడి 8రోజుల తరువాత విడుదల అయిన కంభంపాటి నచ్ కేత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు..గతంలో తాను పట్టుబడినప్పుడు పాక్ జవాన్లు తనను తీవ్రంగా కొట్టారని ఒకానొక దశ లో చంపాలని చూశారని అయితే ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఓ పాకిస్థాన్ సీనియర్ అధికారి ఆ జవాన్లను నియంత్రించి తనను రక్షించి దూరంగా తీసుకు వెళ్ళారని చెబుతూ అప్పుడు తనకెదురైన అనుభవాలను నెమరువేసుకున్నారు