Rajsri 143's Album: Wall Photos

Photo 64 of 316 in Wall Photos

ఆదరించే మనసు నీకుంటే
ఆటంకాలు ఎన్నున్నా
సూర్యుని ముందు దివిటీలా
వెతలన్నీ వెలవెల బోవును....
కలతలన్నీ కరిగిపోవును
వైద్యుడు ..వ్యాధినే చూసినట్లు ..
ఆశ్రయించిన వారిలో
అవకతవకలు... అవసరంలేని వెన్నున్నా..
వారి అవసరాన్నే చూస్తూ
విచక్షణతో సాగితే
నీ జీవితం ఓ వృక్షమై
ఎందరికో జీవన మధురిమ పంచును
అందుకే...
నీ పని నువ్వు చేసుకొంటూ సాగిపో
సాధ్యాసాధ్యాల యుక్తి తెలుసుకొని.

మంగళకర కార్యాలే
మన శోభను పెంచును...
నేను నేనన్న తలంపు
నీ ప్రగతిని త్రుంచును
పెళుసుగా ఉన్న చెట్టు
ఏపుగా పెరిగినా ....
దేనికి పనికిరానట్లు
అహంకారమే మనిషిని నిస్సత్తువ గా ...మార్చును
ఎన్నున్నా... డాంబికం
నీ ప్రగతికి అవరోదమే
అందుకే వృక్షశాఖలలా ...వంగివుండు
నీ ప్రతిభను... పదుగురికి పంచు.

*శుభోదయం*