Rajsri 143's Album: Wall Photos

Photo 148 of 316 in Wall Photos

*ఓం నమః శివాయ ఓం నమః శివాయ*

చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయా లయ నిలయా
lఓంl

పంచభూతములు ముఖపంచకమై
ఆరుఋతువులూ ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ దృక్కులే అటు అష్టదిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై
తాపసమందార నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయ
lఓంl

త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు
నీ సంకల్పానికి ఋత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్రగాత్రములు శ్రుతికలయ
lఓంl

*