Rajsri 143's Album: Wall Photos

Photo 154 of 316 in Wall Photos

*Il శ్రీ గురు గీత శ్లోకము ll*

*శ్లో|| సర్వ తీరావ గాహస్య* *సంప్రాప్నోతి ఫలం నరః*
*గురోః పాదోదకం పీత్వా శేషం శిరః ధారయన్||*

*భావము* :- గురువు యొక్క పాదోదకమును పానముచే
శేషమును శిరస్సున ధరించు నరుడు సర్వతీర్ధములందు
స్నానముచేసిన లేక సర్వ పుణ్యస్థలములను దర్శించిన ఫలమును
పొందును.
*వివరణ*:- శ్రీ సాయిబాబా పాదములనుండి గంగా,
యమునలు ప్రవహించుట గమనారము. అది చైతన్యమునకు రెండు
అంశములు కలవు. ఒకటి చైతన్యము, రెండు శక్తి. చైతన్యమును
శివుడని, శక్తిని పార్వతియని, ఆ రెండింటి ఏకత్వమును అర్థ
నారీశ్వరుడని చెప్పుదురు. ఆ రెండంశములు రెండు పాదములుగా
కలవాడు సద్గురువు. అనంతకోటి విశ్వములు, భూతములు
సద్గురువుయొక్క శక్తి అనెడి ఒక పాదము. ఇందు సర్వ తీర్థములు,
సర్వ పుణ్యక్షేత్రములు, సర్వదేవతలు ఇమిడివున్నారు.