Rajsri 143's Album: Wall Photos

Photo 165 of 316 in Wall Photos

శ్రీ సాయి
*శ్రీ సాయిపరమాత్మనితో నీ సంబంధం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తి నీది*

*శ్రీ సాయిపరమాత్మునిపై నమ్మకం ఉన్నవారికి అతనితో సంబంధం స్వతహాగా ఏర్పడి ఉంటుంది. నమ్మకము అంటే నా ఉద్దేశ్యము – ”జీవితంలో ఏదైతే జరిగిందో అంతా మంచే జరిగింది, జరగబోయేది కూడా మరింత మంచిగా ఉంటుంది” అన్న నమ్మకము. ఈ నమ్మకము పెరగాలంటే నీలోని అహంకారాన్ని తొలగించి బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకో. ఇతరుల ప్రభావంలోకి నీవు రాకు.*

*శ్రీ సాయిబాబా సంతానముగా స్వయాన్ని భావించి అతను చెప్పేది విను, నిర్లక్ష్యంగా వినద్దు. శ్రద్దతో, ప్రేమ, సమర్పణ భావంతో విను. తర్వాత, నీతో నీవు ఆలోచించు కునేటప్పుడు లేక మాట్లాడుకునేటప్పుడు శ్రీ సద్గురు సాయిబాబా ఏమి చెప్పారు అని ఆలోచించుకో.*

*అప్పుడు శ్రీ సాయిబాబా తో నీ సంబంధం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తిని పొందుతావు. భయము నాశనమవుతుంది. నీ జీవితంలో ప్రతీదీ సహజంగా కనిసిస్తుంది. నువ్వు స్వచ్ఛంగా, తెలివైనవాడిగా, మంచిగా తయారవుతావు.*
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.