Rajsri 143's Album: Wall Photos

Photo 218 of 316 in Wall Photos

పీవీ సింధు సెమీఫైనల్ కి వెళ్లిన పోస్ట్ చేస్తారు కానీ ఇండియా కి గోల్డ్ మేడల్స్ తెచ్చిన హిమదాస్ ని ఎవరు పాటించుకోరు షేమ్ ఇండియా లోకమంతా విజ్ఞానంతో పరుగెడుతుంటే
ఈ దేశం వేలయేండ్లుగా కులంతో పరిగెడ్తుందనీ
నీకు తెలుసా హిమదాస్.!?
అన్నట్టు ఇంతకు నీదేకులమమ్మీ.!?
చిరుతలను వెనక్కి నెట్టి పరుగెడుతున్నవ్.!?

నీదేశంలో రాకెట్ దూసుకపోవాలన్న
తంత్రం-మంత్రం-అంత్రం గట్టిగా వుండాలనీ
నీకు తెల్వదా!? రాకెట్లా దూసుకపోతున్నవ్
అన్నట్లు నీది వెలివాడనా ఏంది!?

మడి ఉంటేనే గుడి-బడి సాఫీగా సాగేటి
ఈ కర్మభూమిలో సునామీలా దూసుకొస్తూ
పసిడిపంటలనే నాటేస్తున్నవ్
ఇంతకీ నీ కుల-గొత్రాలు అంటరానివా..!?

గోమూత్రమే అమృతవర్షంలా కీర్తించబడి
సాటిమనిషినీ కండకండాలుగా నరికేటి
కావరమెక్కిన నీ దేశంలో
ఖండాంతరాల కీర్తీని చాటుకుంటున్నవ్
కొంపదీసీ నీపుట్టు-పూర్వోత్తరాలు ఊరవతలనా.!?

అవును నీఘణకీర్తినీ ఇంతలా దాచిపెడుతున్న
ఈదేశంలో నీకులమేందో నాకు తెలిసింది హిమదాస్
కులం అడుగులను వెతుకుతూ పరిగెడ్తున్న ఈదేశంలో
నువ్వు మనువాధాన్ని తొక్కుతూ పరుగెడుతున్న
జైభీమ్ సంతతివనీ జయహో హిమదాస్

ఇంకా-ఇంకా పరుగెత్తు
ఈదేశ కులపు యేర్లన్నీ తెగేవరకు
తడిమడినీ నీచెమటతో ఎండగొడ్తూ
దుమ్మురేపుతూ పరుగెత్తూ ముమ్మాటికీ
ఈదేశం నీదే..మనదే
జయహో జయహో జంభూ యువరాణి