Rajsri 143's Album: Wall Photos

Photo 264 of 316 in Wall Photos

పరమ గురువు జోగినాథుడు
నీతి సారము పలుకనొచ్చె
వినుకోండి వినుకోండి జనులార

లోని స్వార్థం మక్కువయితే
పెద్దల మాటలన్నీ పెడచెవిన పెట్టేవురా
స్వజన పక్షపాతం పెరిగిపోతే
ప్రియ హితవులన్నీ వ్యర్థమయ్యేనురా

ఆశ అత్యాశగా మారిపోతే లోభమొచ్చి
పైకి పలికే మాటలన్నీ వట్టిపోయేనురా
మంచి చెడులు అన్నీ మర్చిపోయేవురా
బంధుమిత్రులు కూడ దూరమయ్యేనురా

సృష్టిలో నీవు గొప్పని నీ తెలివి గొప్పని
శక్తియుక్తులన్ని నీ సొంతమని
తలబోయు నరుడా మూర్ఖమది తెలియురా
గర్వబలం తగ్గకుంటే కీర్తి అపకీర్తిగా రూపు మారేనురా

దండములు దండములు జోగినాథా
పదివేల దండములు జోగినాథా