Rajsri 143's Album: Wall Photos

Photo 291 of 316 in Wall Photos

*చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమర యోధుడు - చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు...చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం.*

*సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర్య సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్.*