Rajsri 143's Album: Wall Photos

Photo 4 of 316 in Wall Photos

కన్నులు వెన్నెల కురిపించిన వేళ

మావి చిగురులు మేసి
కోయిల తీయగా కూసింది..
నీ వలపుతలపులు మేసి
మనసు రాగాలు తీసింది...

కారు మబ్బుల సొగసు
వెండిపూతతో మెరిసింది
అందాల నీ మోము సొగసు
గుబురు మీసాలతో మెరిసింది..

వేణుగాన సరళికి
బృందావని పులకించింది
నీ మృదుపాద రవళికి
హృదయమే నర్తించింది..

చిరుజల్లులు కురిసిన వేళ
ప్రకృతి పరవశించింది
కన్నులు వెన్నెల కురిపించిన వేళ
మనసు ఆనంద తాండవమాడింది..

కలువ చంద్రుని రాక కొరకు
ఆత్రముగా వేచింది
ఈ రాధ మాధవుని కొరకు
తపములే చేసింది.