Rajsri 143's Album: Wall Photos

Photo 37 of 316 in Wall Photos

హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం పాహి పరమేశ్వరా ఈశ్వరా

నిరంతరము నీ
శిరమున అభిషేకించే
గంగమ్మ కావాలంటావా ?
క్షణమైనను మరువక
నీకొరకై
నా మదిలో నీకై
ఆర్తితో జనించే
కన్నీరు చాలదా !

భగ భగ మండే
కాష్టపు కట్టెల కొలిమి
చలి కాచుకొనేందుకు
కావలెనందువా ?
నిన్ను చేరాలని
నిలువునా నన్ను
దావానలంలా దహిస్తున్న
కోరిక చాలదా !

చుట్టూ
మంచు కొండలు
మాత్రమే
ఆవాసమందువా ?
ఘనీభవించిన కన్నీటి
కొండల నడుమ
హృదయ సింహాసనం
చాలదా !

ఏమయ్యా శివయ్యా
నీ కోరికలకు అంతే లేదా

పిడికెడు గుండె నాది
గుండె నిండుగా నిలిచి
కొండంత నమ్మకాన్ని
వమ్ము కానీయక
ఆదరించి
పాలించి
పరిపాలించలేవా

పరమేశ్వరా శరణు..శరణు...✍✍✍