Rajsri 143's Album: Wall Photos

Photo 67 of 316 in Wall Photos

ద్వేషాలని మరువలేరు బ్రతికిఉన్న రోజుల్లో
ప్రేమపంచి నవ్వలేరు కలిసిఉన్న రోజుల్లో...

పూవులన్ని వేస్తారట దారంటా చివరిసారి
ఒక్కపువ్వు ఇవ్వలేరు మనిషిఉన్న రోజుల్లో...

సంతాపం పెడతారట ఒకడుపైకి పోయాకే
ఎవ్వరినీ పొగడలేరు మెరిసిఉన్న రోజుల్లో...

కన్నీరే పెడతారట ప్రాణమాగి పోగానే
సానుభూతి గెలవలేరు నలిగిఉన్న రోజుల్లో...

ఎంతమందొ వస్తారట కడసారిగ చూడాలని
లేనివాడ్ని చూడలేరు కలిమిఉన్న రోజుల్లో...

తప్పులన్ని మరిచేరట తలవాల్చిన మరునిముషం
క్షమాగుణం చూపలేరు మురికిఉన్న రోజుల్లో...

అందరమూ ఒకటేనని చెబుతారట ముకుందా
ఆమాటే రాదెందుకు చెదిరిఉన్న రోజూల్లో...