Rajsri 143's Album: Wall Photos

Photo 96 of 316 in Wall Photos

రామ శబ్దానికి అర్ధం అత్యద్భుతం. రమణీయత్వాత్ రామ : అంటే రమణీయమైన వాడు రాముడు. క్షణ క్షణానికి కొత్తగా అనిపించేదే అందం అంటే. అదే రమణీయం. నిత్య నూతనమైన ఆత్మ వస్తువు రాముడు. ఆనందంకలిగించేవాడు, బహు సుందరుడు శ్రీరాముడు. సర్వ ప్రాణకోటిలో ఆత్మవస్తువై ఆనందస్వరూపుడై, సచ్చిదానంద పరబ్రహ్మమై భాసిల్లేవాడు. సత్ అంతే ఎల్లపుడు, చిత్ అంటే చైతన్యం. ఆ సత్ చిత్ లను కలిగినవాడు శ్రీరామచంద్రుడు. శ్రీ రామ చరిత్రను నిత్య పారాయణ చెయ్యడం భారతీయ ఆర్ష సాంప్రదాయం