Rajsri 143's Album: Wall Photos

Photo 249 of 316 in Wall Photos

నీవెంత
చతురుడివి శివయ్యా

కొంతమంది
జీవితాలలో పెను
మార్పులు దశాబ్దాలకి తీసుకొస్తావు

ఇంకొంత మంది
జీవితాలలో గొప్ప
మార్పులను సంవత్సరాలకి కలిగిస్తావు

మరి కొద్ది మంది
జీవితాలలో ఊహించని
మార్పులు నెలలలో చూపిస్తావు

అతి కొద్ది మంది
జీవితాలలో మార్పులను
రోజుకోసారి చూపిస్తావు

అంతే రోజూ మారే
పరిస్థితులలో కూడా
నిన్ను
శక్తితో స్మరించారా
భక్తితో ధ్యానించారా
ఆర్తితో పిలిచారా
అనేగా నీవు చూసేది

నీకు తెలియనిదా శివయ్యా
నువ్వు గంటకి నిముషానికి
జీవితంలో మార్పులు తెచ్చినా
నీ పాదములు విడువనని
నీ ధ్యానము మరువనని
నీ స్మరణ వదలనని

తీసే ఊపిరిలో నీవు
నిలచినపుడు
నిన్ను మరచి
నేను ఎలా జీవించగలను

పరమేశ్వరా శరణు..శరణు...