Rajsri 143's Album: Wall Photos

Photo 261 of 316 in Wall Photos

*|| శ్రీ గురుగీత శ్లోకములు ||*

*శ్లో || అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకం |*
*జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం గురోః పాదోదకం పీబేత్ ||*

*భావము*:- అజ్ఞానం యొక్క మూలమును నశింపజేయుటకు, జ్ఞానవైరాగ్యములు సిద్ధించుటకు, జన్మ కర్మ నివారకములగు
గురుపాదోదకమును పానము చేయవలయును.

*వివరణ*:- సర్వము తానైన సద్గురువునకు తన అంశమైన లౌకిక విషయములందు వైరాగ్య ముండును. ఆయన యొక్క
సహజమైన ఆనందము ముందు లౌకిక సుఖములు (తుచ్చములగు) అత్యల్పములగును. ఇట్టి వైరాగ్యమునకు కారణము తానే
సర్వము అనెడు జ్ఞానము ప్రధానము. గురువు నందలి యా గుణము సదా ద్యానించుట వలన భక్తునకు జ్ఞానవైరాగ్యములు
సహజంగానే సిద్దించును. లౌకిక సుఖములను గూర్చి చింతన చేయుటయే వ్యామోహమునకు కారణము. వైరాగ్యమును
చింతన చేయుటలో, ఐహిక విషయాలను గురించి చింతన చేయకుండుట ఇమిడియున్నది. నిప్పులోనుంచబడిన ఇనుము తన
గుణములు కోల్పోయి అగ్ని యొక్క గుణములు సంపూర్ణముగా పొందినట్లు మనస్సును యె భావమునందుంచిన దాని రూపమే
యగును.