Rajsri 143's Album: Wall Photos

Photo 295 of 316 in Wall Photos

అతని మూతిపై పెరిగిన మీసం
అతని మదిలో ఎగిసిన రోషం
వెనుకా ముందూ ఆలోచన లేదు
ఉరి శిక్షంటే అతనికి లెక్క లేదు

అతని కాళ్ళు భారత గడ్డ పైన
అతని చేతులు తన గన్ పైన
భారతీయుల వెలుగు కిరణం
వలసవాదులకు అదో భయం

అతని తనువు దేశం కోసం
తన తను వొక మరిగే రక్తం
అతని మనసు జాతి కోసం
అతనొక రగిలే హృదయం

అతను జాతి పౌరుష రూపం
అతను ఆవేశపు ప్రతి రూపం
తెల్ల వాళ్ళకు సింహ స్వప్నం
భారతీయుల ఆరాధ్య దైవం

అతడే చంద్ర శేఖర ఆజాద్
భారతీయులారా ఆ రూపం
మెదలాలి మదిలో కలకాలం
తీర్చుకోలేము వీరుని ఋణం.