Rajsri 143's Album: Wall Photos

Photo 297 of 316 in Wall Photos

3:05 నిమిషముల దర్శనమ్

శ్రీ సాయి

*మనము గంగాస్నానము చేస్తాము. గంగాస్నానము పాపాలను నాశనం చేసేది మాత్రమే కాదు ; చచ్చిపోయినతరువాత కూడా శరీరం కాలి పోయిన తరువాత వచ్చిన బూడిదకు కూడా గంగస్పర్శ తాగిలితే, ఆత్మ లేకపోయినప్పటికీ-పూర్వశరీరంలో ఉన్న ఆత్మ, ప్రేతరూపంలో ఉన్నప్పటికీకూడా-ముక్తినిపొందుతున్నాడు.*
*ఇది గొప్ప ఆర్యరహస్యము ఎవరికి అర్థంకానటువంటిది. అసలు ఎలాగ అర్థం అవుతంది! ఏమిటి దీని అర్థం! తర్కంతో(వాదన చేసుకుంటే) తెలిసే విషయం కాదు. అసలు తర్కమేలేదు దీనికి(ఆధారం కోసం వెతకడం కాదు). మనం ఏనాడు ఆర్యసంస్కృతిలో ఉన్న గొప్ప మౌలికసూత్రాలను, ధర్మాలను ప్రశ్నించకుండా వాటిని పూర్తి విశ్వాసంతో నమ్మటానికి అలవాటు చేసుకుంటామో,అప్పుడే మనకు భవిష్యత్తు(భగవంతుడు) ఉన్నది. మన బుద్ధి, మనకు ఉన్న ఆలోచనల చేత, కుశలతచేత దానిని పరీక్షించి, దానికి మన తర్కాన్ని అన్వయించి, “నా తర్కానికి ఇది నిలబడింది. కాబట్టి ఇది సత్యమే” అనుకుంటే; మనకు తెలిసిన తర్కం, మనకుండే విజ్ఞానం చాలా తక్కువ. దానిని పరీక్షించేందుకు మనము అధికారులమే కాదు. మనకు ఉండేటటువంటి యుక్తి, బుద్ధికుశలత చాలా అల్పం.*

*కాబట్టి గంగ అనేటువంటి వస్తువు అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ కూడా పవిత్రమయినదే! యజ్ఞంలో మనం గంగోదకం చల్లుకొని పవిత్రుల మవుతున్నాము. గంగ కటువంటి శక్తి ఉంది. జీవితంలో ఒక్కమాటైనా గంగాస్నానం చేసితీరమని మాన పెద్దలు చెవుతు వుంటారు .అయితే కొందరు, “గంగ అపవిత్రంగా ఉందండీ!” అంటారు. అయ్యా! మురికిఉందికాని అపవిత్రంగాలేదు” అని సమాధానం చెప్పాలి. అది ఎలాగ అంటే “నీవు వెళ్ళి ఆ యోగికి నమస్కారం చేసావు కదా! నీ శరీరంలో ఉన్నట్లుగానే ఆయన శరీరంలో కూడా మలమూత్రాలు ఉన్నాయి. ఆయనకెందుకు నమస్కరించావు? ఆయనలో రక్తమాంసాలు, చర్మము క్షీణించి అందంగా కూడా లేడాయన. కేవలం సుందరమైన దేహంతో, రూపంతో అందంగా ఉన్నాడని నీవు ఎవడికైనా నమస్కారం చేస్తావా?” అని అదిగితే, ఏమిటి సమాధానం.*........

ఇంకా పూర్తికాలేదు..... ఎవరు ఎటువంటి సంధానమ్ చెపుతారు.........?