Rajsri 143's Album: Wall Photos

Photo 306 of 316 in Wall Photos

" 1999 మే కాశ్మీర్ లోని టైగర్ హిల్స్ ప్రాంతం. సముద్రమట్టానికి 16,700 అడుగుల ఎత్తులో రక్షణపరంగా అత్యంతకీలకమైన టైగర్ హిల్ ఫోష్టు ను శత్రువులు దొంగచాటుగా ఆక్రమించుకున్నారు. అది తెలియని భద్రతాసిబ్బంది అక్కడకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు..
జూలై-5 న 1999,,18 వ గ్రెనేడియర్స్ కు చెందిన 25 మంది సైనికులు మళ్ళీ టైగర్ హిల్స్ పైకి వెళ్ళేందుకు 90॰ కోణంలో కొండపైకి ఎక్కుతున్నారు. కొంతదూరం వెళ్ళాక శత్రువులు వారిపై దాదాపు ఐదుగంటలు భీకరంగా కాల్పులు జరిపారు. భారతసైనికులలో 18 మంది తప్పనిపరిస్థితులలో వెనుదిరిగారు.ఇంక 7 మంది మిగలారు.

కొన్నిగంటల తరువాత 10 పాక్ సైనికులు ఎంతమంది భారతజవానులు చనిపోయారో చూడటానికి క్రిందకివస్తున్నారు. అదను కోసం భారత జవానులు ఎదురుచూస్తున్నారు.భారత సైనికుల దగ్గర కేవలం 45 రౌండ్స్ బుల్లెట్స్ మాత్రమే వున్నాయి.ఇంతలో క్రీమ్ కలర్ పఠానీ సూట్స్ ధరించిన పదిమంది శత్రుసైనికులు భారతసైనికుల దగ్గరకు వచ్చారు.అంతే ఒక్కసారిగా భారతసైనికుల చేతిలలోని వెపన్స్ గర్జించాయి. 8 మంది శత్రుసైనికులు నేలకొరగగా ఇద్దరు వెనుకతిరిగి పరిగెత్తి మాయమైపోయారు.

కాసేపట్లో మళ్ళీ 35 మంది పాక్ జవాన్స్ ఈ 7 మంది భారతజవానులను చుట్టుముట్టారు.కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి..భారతసైనికులలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పాక్ సైనికులలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతసైనికులపై వున్న కసితో శవాలనూ బుల్లెట్స్ ఛిద్రం చేస్తున్నారు పాక్ సైనికులు..వారి ఆయుధాలను స్వాధీనంచేసుకుంటున్నారు..
కానీ 19 సంవత్సరాల భారతసైనికుడు కొన ఊపిరితో పాక్ జవానుల మధ్యలో పడుకొని ఇదంతా గమనిస్తున్నాడు. అప్పటికే దాదాపు 15 బుల్లెట్స్ అతని శరీరంలో దిగబడివున్నాయి.చాలా రక్తం పోయింది.పాక్ సైనికుల మధ్యపడిపోవడంతో అతనిని గమనించలేదు వాళ్ళు..భారతసైనికుల ఆయుధాలన్నీ మూటగట్టుకొని వెనుదిరిగారు పాక్ జవానులు..అదంతా గమనిస్తున్న ఆ యువభారత్ సైనికుడు అతికష్టంమీద మెల్లగా చేతిని ప్యాంట్ జేబులోనికి పోనిచ్చి అందులో వున్న గ్రెనేడ్ ను తీసి శక్తినంతా కూడతీసుకొని ఒక పాక్ సైనికుడిపై విసిరాడు. అది ఆ సైనికుడి హెల్మెంట్ మీద పడి అతని తల ప్రేలిపోయింది..వారు షాక్ లో నుండి తేరుకొనే లోపల పాక్ సైనికుడి దగ్గర వున్న గన్ తో మిగతా ఆరుమంది శత్రువులను నేలకుాల్చాడు.

అధికరక్తస్రావం వల్ల అతని కళ్ళు మూతలుపడుతున్నాయి. కళ్ళముందు చీకట్లుకమ్మినట్లనిపిస్తుంది..వెల్లికలాపడి బలవంతంగా కళ్ళు తెరిచి ఆకాశంవైపు చూసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒకపాక్ సైనికుడి దగ్గర వున్న వైర్లస్ సెట్ నుండి...మీరందరూ టైగర్ హిల్స్ ను ఖాళీచేసి క్రిందకు రండి,,అక్కడకి దగ్గరలో వున్న "ఎం ఎం జీ బేస్ పై ఎటాక్ చేయండి" అంటూ సందేశం వినబడింది. ఎంఎంజి బేస్ అక్కడికి 500మీటర్ల దూరంలో వుంది. అతికష్టం మీద వున్నశక్తినంతా కూడగట్టుకొని ఆ యువజవాన్ లేచి కొంచెం ప్రక్కగా పారుతున్న కాలవలో దూకేసాడు.కొన్ని నిమిషాలలో 400 మీటర్లు క్రిందకి తీసుకొచ్చిందాకాలువ.. ఇంతలో అక్కడ గస్తీలో వున్న భారతసైనికులు అతనిని రక్షించారు.. వళ్ళంతా బుల్లెట్లదాటికి చిల్లలుపడి ,అత్యంత దయనీయస్థితిలో వున్న ఆ యువకుడిని చలించిపోయారువాళ్ళు. అక్కడే వున్న CO కుశహాల్ సింగ్ ..బాబూ నన్ను గుర్తుపట్టగలవా? అని ఆ యువజవాన్ ను ప్రశ్నించగా ,,చిన్న కళ్ళుగా తెరిచిన జవాన్ ..సాబ్ !,నాకళ్ళు మసగబారుతున్నాయి..మీ గొంతు గుర్తుపట్టగలను..మీరు సింగ్ సాబ్ అంటూ మరికొద్దిసేపటిలో ఎంఎంజీ బేస్ పై దాడి జరుగుతుంది..జైహింద్ ..సాబ్ అంటుా సృహకోల్పోయాడు. వెంటనే అతనిని హాస్పటల్ కు పంపి,.వెంటనే ఎంఎంజీ బేస్ ను రౌండప్ చేసాడు కుశహాల్ సింగ్ ,,కొంత సమయం తరువాత బేస్ పై దాడికి వచ్చిన శత్రువులను మట్టుబెట్టారు..

ఇంతకీ ఆ 19 యేండ్ల యువసైనికుడి పేరేమిటో తెలుసా??? "యోగేంద్రసింగ్ యాదవ్ ".బులందర్ వాసి. అతని ధైర్యసాహసాలకు మెచ్చి ఆయనకు"పరమవీర్ చక్ర బిరుదిచ్చి సత్కరించింది భారతప్రభుత్వం!!

ఇది సినిమా కథకాదు.ఒకవాస్తవకథ"