Rajsri 143's Album: Wall Photos

Photo 311 of 316 in Wall Photos

నీ ఊసు వినపడక
ఆకాశం చిన్నబోయింది
నక్షత్రాలు నైరాశ్యంతో
నిశీధి నీడకు చేరుకున్నాయి
దిగులు చెందిన మేఘాలు
దుఃఖాన్ని వర్షిస్తున్నాయి
ఈ నిశ్శబ్దాన్ని తాళలేని దెసలు
దిక్కుతోచక..దిక్కులు చూస్తున్నాయి
కరుడుకట్టిన గుండెల జనారణ్యంలో..
కపటమెరుగని మమతల మహర్షీ..!
నీ మాటల్లోనే కాదు
మౌనంలోనూ నీ మనసు సౌందర్యాన్ని వీక్షిస్తున్నాను
ఈ జన్మకు నీకేమీ కాలేని నేను..
దయతో అర్ధిస్తున్నాను
నాకు దూ..ర..మ..వ్వ..కు..మై శ్రీ!
నీ ఉనికే కదా
నా శ్వాసకు ప్రాణాధారం
సన్నిహిత దృశ్యంగా నాకు కనపడకపోయినా..
ఓ ఆత్మీయ వాక్యానివై
నా తుదిశ్వాస వరకూ..వినిపిస్తూ వుండు..!!
---------