Rajsri 143's Album: Wall Photos

Photo 178 of 316 in Wall Photos

శ్రీ సాయి
"మన శరీరాన్ని, మనసును సత్యం వైపు నడిపించటం ఎలా సాధ్యం...అసలు సాధ్యం అవుతుందా...లేదా..... ?"

*చంచలత్వం(నిలకడ లేని మనస్తత్వం) విడనాటటం ద్వారా సాధ్యం అవుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనసును ఒకే విషయంపై లగ్నం చేయటమే మనం చేస్తున్న ప్రయత్నం. కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే కాకుండా మనసు ఏకాగ్రత నిత్యజీతంలో కూడా అవసరమే. కానీ ఆలోచనలు మారుతూ ఉండడం వలన అది సాధ్యం కావటం లేదు. ఒక విద్యార్థి ఒక సబ్జెక్టునే రోజు చదువుతూ వున్నారు అనుకోండి అది చంచలత్వం కాదు. పది నిముషాలకొక సబ్జెక్టు చదవాలనుకోవటం చంచలత్వం అవుతుంది. ఇలాంటి చంచలత్వం పోవటానికే మనసుకు ఒక మంత్రాన్ని అప్పగించి(మనకు నచ్చిన సాయి నామాన్ని), ఏదోక ఆసనంలో కూర్చో బెడుతున్నాం (మనసుని స్థిరగమగా ఉంచుతున్నాము). శరీరాన్ని, మనసును మనలోని సత్యంవైపు మళ్ళించటమే మనఉద్దేశ్యం. కేవలం ఒక ఆలోచన, ఒకే క్రియ మాత్రమే ఆధ్యాత్మికత అయితే ఇక మనిషికి జీవితం ఉండదు. మన జీవనక్రియల్లో ప్రతిపనికి జ్ఞాపకం, ఆలోచన ముడిపడి ఉంది మరి !*

*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం, ఆలోచించేది శ్రీ సాయినాధుడు అనుకోని చూసినప్పుడు నీకు చంచలత్వం పోయి మనసు స్థిరం అవుతుంది !'.*